#ipl2019
#cskvmi
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
#rohitsharma
ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగో వికెట్ చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన స్పిన్నర్ కృనాల్ పాండ్య బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 బాదిన ఓపెనర్ డుప్లెసిస్ (26: 13 బంతుల్లో 3x4, 1x6) స్టంపౌటవగా.. అనంతరం వచ్చిన సురేశ్ రైనా (8: 14 బంతుల్లో) తడబడి స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులో వచ్చిన అంబటి రాయుడు (1) కూడా పేలవంగా వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిపోగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (2: 8 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అయితే.. మరో ఓపెనర్ షేన్ వాట్సన్ (41 నాటౌట్: 39 బంతుల్లో 5x4, 1x6) నిలకడగా ఆడుతుండటంతో 13.3 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 84/4తో కొనసాగుతోంది.
అంతకముందు చెన్నై బౌలర్లు దీపక్ చాహర్ (3/26), శార్ధూల్ ఠాకూర్ (2/37), ఇమ్రాన్ తాహిర్ (2/23) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో హిట్టర్ కీరన్ పొలార్డ్ (41 నాటౌట్: 25 బంతుల్లో 3x4, 3x6), ఓపెనర్ డికాక్ (29: 17 బంతుల్లో 4x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (15: 14 బంతుల్లో 1x4, 1x6), హార్దిక్ పాండ్య (16: 10 బంతుల్లో 1x4, 1x6) పేలవంగా వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో.. తొలి పవర్ ప్లే మినహా.. ఏ దశలోనూ ముంబయి టీమ్ మెరుగైన స్కోరు చేసేలా కనిపించించలేదు. మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (15: 17 బంతుల్లో 1x4), ఇషాన్ కిషన్ (23: 26 బంతుల్లో 3x4), కృనాల్ పాండ్య (7: 7 బంతుల్లో) బంతుల్ని ఎక్కువగా వృథా చేయడంతో ముంబయి 149 స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments